BREAKING
ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ బొబ్బిలి మాజీఎమ్మెల్యే. .చంబంగివెంకట చిన్నప్ప నాయుడు పోలింగ్ లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలి : జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్..* శ్రీధర్ గాదె కొత్త సినిమా 'కొరివి' టైటిల్ గ్లింప్స్ విడుదల: ఈశ్వర్ రాచిరాజు హీరోగా విలేజ్ బ్యాక్ డ్రాప్ హారర్ మూవీ కన్నడ నటి రన్యారావుకు వీఐపీ ప్రొటోకాల్ దర‍్శనం: తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు క్రైస్తవ సమాజంలో సంస్కరణలు రావాలి - పల్లె శాంతిరాజ్ లక్ష ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న చలమల్ల కృష్ణారెడ్డి పేదల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నది కూటమి ప్రభుత్వమే. అట్టహాసంగా ముగిసిన 'మోహన మంత్ర'! విద్యార్థుల మేధస్సుకు పట్టం కట్టిన టెక్నో-కల్చరల్ ఫెస్ట్. అంగన్‌వాడి కేంద్రంలో పాము కలకలం.. కరువు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్ కు వినతి - మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి. ### పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని బర్తరఫ్ చేయాలి జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజుపై పార్టీ నాయకుల తీవ్ర ఆరోపణలు బొర్రంపాలెం సమావేశంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ బంగ్లాదేశ్‌లో విజృంభిస్తోన్న డెంగ్యూ మహమ్మారి టిజిపిసిబిలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు తైపీ మేయర్‌కు ఘోర అవమానం.. ప్రైడ్ పరేడ్‌లో నిరసనల హోరు మళ్లీ ఆదరిస్తే శంబర మరింత అభివృద్ధి

ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

Select Suryaa Now
ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి  జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

నరసరావుపేట : జిల్లాలో మున్సిపల్ ఎన్నిక లను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేం దుకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను ఆమె వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల మాట్లాడుతూ జిల్లాలోని  నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో మొత్తం 308 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎన్నికల అబ్జర్వర్ సమక్షంలో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి, ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది, పోలింగ్ సామగ్రిని సకాలంలో తరలించేందుకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద వాహనాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుం దని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల నిర్వహణతో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమర్థవం తంగా చేపట్టేందుకు సిబ్బందికి ఇప్పటికే మూడు విడతలుగా సమగ్ర శిక్షణ అందించినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు చోటుచేసు కోకుండా జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియో కెమెరాల ద్వారా వెబ్‌కాస్టింగ్, ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నాలుగు ప్రాంతాల నుంచి ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఓటర్లందరికీ ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగిం చుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల కోరారు.

మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..