ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం!
బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. సముద్రంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తుఫాన్‌గా మారేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం చెన్నైకి 1,140 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,200 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అనంతరం మరింత బలపడి తుఫాన్‌గా మారనుందని పేర్కొంది. నవంబర్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకునే అవకాశాలున్నాయి. ఈ తుఫాన్‌కు ‘మురసు’ అనే పేరును ఖరారు చేశారు. తుఫాన్ ప్రభావంతో ఏపీ తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. తుఫాన్ కదలికలు, తీవ్రత, ప్రభావంపై వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అధికారుల సూచనలు పాటించాలని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.