తెదేపా కార్యకర్త మృతికి ఎమ్మెల్యే నివాళి - ఎగువ మాసాపల్లిలో కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మోహన్
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:చిత్తూరు రూరల్ మండలం ఎగువ మాసాపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త భారత్ మృతి పట్ల చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.శనివారం గ్రామానికి వెళ్లి కార్యకర్త భరత్ మృతదేహానికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి, పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.పార్టీ కోసం కార్యకర్త చేసిన సేవలను ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు టిడిపి కార్యాలయం కార్యదర్శి మోహన్ రాజ్, జయచంద్ర నాయుడు, శ్రీకాంత్, చిత్తూరు రూరల్ మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్