BREAKING
శ్రీధర్ గాదె కొత్త సినిమా 'కొరివి' టైటిల్ గ్లింప్స్ విడుదల: ఈశ్వర్ రాచిరాజు హీరోగా విలేజ్ బ్యాక్ డ్రాప్ హారర్ మూవీ కన్నడ నటి రన్యారావుకు వీఐపీ ప్రొటోకాల్ దర‍్శనం: తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు క్రైస్తవ సమాజంలో సంస్కరణలు రావాలి - పల్లె శాంతిరాజ్ లక్ష ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న చలమల్ల కృష్ణారెడ్డి పేదల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నది కూటమి ప్రభుత్వమే. అట్టహాసంగా ముగిసిన 'మోహన మంత్ర'! విద్యార్థుల మేధస్సుకు పట్టం కట్టిన టెక్నో-కల్చరల్ ఫెస్ట్. అంగన్‌వాడి కేంద్రంలో పాము కలకలం.. కరువు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్ కు వినతి - మాజీ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి. ### పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని బర్తరఫ్ చేయాలి జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజుపై పార్టీ నాయకుల తీవ్ర ఆరోపణలు బొర్రంపాలెం సమావేశంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ బంగ్లాదేశ్‌లో విజృంభిస్తోన్న డెంగ్యూ మహమ్మారి టిజిపిసిబిలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు తైపీ మేయర్‌కు ఘోర అవమానం.. ప్రైడ్ పరేడ్‌లో నిరసనల హోరు మళ్లీ ఆదరిస్తే శంబర మరింత అభివృద్ధి పట్టణ సుందరీకరణ పేరుతో నిరుపేదల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదు – బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి.ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్ సందిగ్ధంలో: పోగుల సైదులు గౌడ్

మర్పల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

Select Suryaa Now
మర్పల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

మర్పల్లి, మేజర్ న్యూస్:మర్పల్లి మండల శివారులోని అబ్దుల్ రెహమాన్ వెంచర్‌లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి ఏడుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.52,240 నగదుతో పాటు పేకముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 30వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో అబ్దుల్ రెహమాన్ వెంచర్‌లో కొందరు వ్యక్తులు ప్రభుత్వం నిషేధించిన పేకాట ఆడుతున్నట్లు మర్పల్లి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్సై అబ్దుల్ రవూఫ్ తన సిబ్బందితో కలిసి సదరు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నగదు పందాలు కాస్తూ పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.52,240 నగదుతో పాటు పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఏడుగురిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.