BREAKING
భారత వాయుసేనకు వీడ్కోలు పలికిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి : డ్వామా పీడీ విజయలక్ష్మి తెదేపా కార్యకర్త మృతికి ఎమ్మెల్యే నివాళి - ఎగువ మాసాపల్లిలో కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మోహన్ ఎరువుల దుకాణాలు తనిఖీ మెక్‌డొనాల్డ్స్‌ 'మెక్‌రిబ్' శాండ్‌విచ్ కేసుపై విచారణకు అంగీకరించిన అమెరికా కోర్టు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకే క్రీడా పోటీలు : ఎంఈఓ భాగ్యమణి స్పానిష్ వేదికపై సంచలనం సృష్టించిన 90 ఏళ్ల జపాన్ బాడీబిల్డర్ జర్మనీని తాకిన జెన్-జీ నిరసనల హోరు విద్యార్థి పై దాడి చేసిన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలి. అశాంతికి అడ్డుకట్ట వేసేందుకు ఫ్రాన్స్ సర్కార్ చర్యలు..70 వేల మంది పోలీసుల మోహరింపు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు సిద్ధమైన అధికారులు. కాలిఫోర్నియాలో ఉత్కంఠ రేపుతున్న ICE దాడులు *పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన సర్పంచ్ చింతలపల్లి విజయ-రాజారెడ్డి* బీసీ ఉద్యమకారులను గుర్తించాలిః మట్టా జయంతి గౌడ్

బియ్యం షాపులపై అధికారుల దాడులు..

Select Suryaa Now
 బియ్యం షాపులపై అధికారుల దాడులు..

కూకట్‌పల్లిలో బియ్యం వ్యాపారులపై పౌరసరఫరాల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. పలు బియ్యం దుకాణాలు, హోల్‌సేల్ వ్యాపారుల వద్ద అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) కంటే అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. దుకాణాల్లో ఉన్న బియ్యం నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ ధరలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు బియ్యం విక్రయించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు కూడా బియ్యం కొనుగోలు సమయంలో ధరలను పరిశీలించాలని, అధిక ధరలు వసూలు చేస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.