BREAKING
అకాల వర్షంతో నేలకొరిగిన వరి పంటలు – రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి నష్టపోయిన పంటలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి రైతులకు పరిహారం అందించాలి: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు ఉప్పాడ చేనేతకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం ఓపెన్ ప్లేస్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్‌పై ‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్: ముఖ్య అతిథిగా సోనూ సూద్ పురపోరుకు అంతా రెడీ... భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతామనడం సీఎం చేతకానితనం -- ఢిల్లీకి మూటలు పంపడం ఆపితే రాష్ట్ర అభివృద్ధికి నిధులు సరిపోతాయి -- సీఎం రేవంత్ రెడ్డి పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శలు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాసేవ ముఖ్యం ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తతో నిర్వహించాలి నాన్న కోలగట్ల సేవలను గుర్తించి.. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో అంజన్ రెడ్డి బద్వేల్ జర్నలిస్టు లకుఎలక్షన్ పాసులు మంజూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణ . ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు... తెదేపా సీనియర్ నాయకులు వంగా గోవిందరావు మృతి పార్టీకి తీరని లోటు... ఎంఎల్ఏ " కోండ్రు " గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితుడు సిగిలి వెంకటేష్ పై పీడీ యాక్ట్.... * విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ * అదనపు ఎస్పీ (పరిపాలన) గా బాధ్యతలు చేపట్టిన పద్మలత వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి తెదేపా లోకి వలసలు

విద్యార్థి పై దాడి చేసిన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలి.

Select Suryaa Now
విద్యార్థి పై దాడి చేసిన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలి.

కళ్యాణదుర్గం: రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై రంపంతో దాడి జరిగిన ఘటన అత్యంత విచారకరమని, ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జాతీయ విద్యార్థి సంఘం (జీవీఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు విద్యను అభ్యసించేందుకు వెళ్లిన అమాయక విద్యార్థినిపై దాడి జరగడం దారుణమని, ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థినిపై దాడికి పాల్పడిన నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలన్న తన డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పాఠశాలలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే పవిత్రమైన ప్రదేశాలని, అలాంటి చోట విద్యార్థినుల భద్రతకు ముప్పు ఏర్పడటం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలోనే ఇంతటి దారుణం చోటుచేసుకోవడం బాధాకరమని, విద్యార్థుల రక్షణ విషయంలో మరింత అప్రమత్తత అవసరమని అన్నారు. ముఖ్యంగా తరగతి గదిలో ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ బాధిత విద్యార్థినిని రక్షించేందుకు తగిన ప్రయత్నం జరగలేదన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. విద్యాసంస్థల్లో విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రతి పాఠశాలలో భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించడంతోపాటు, ఆమె కుటుంబానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలవాలని శివకుమార్ నాయక్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, భవిష్యత్తులో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత హోంశాఖపై ఉందని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, హోంమంత్రి అనిత తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ బాలికలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడం విచారకరమని విమర్శించారు. ఇకపై రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే విద్యార్థి సంఘాల తరఫున పోరాటాన్ని ఉధృతం చేస్తామని శివకుమార్ నాయక్ హెచ్చరించారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.