ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్
రేణిగుంట మేజర్ న్యూస్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు–2026లో భాగంగా రేణిగుంట మండలంలో నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కె.వి. రవిచంద్ర, ఎన్నికల అధికారి ఆదినారాయణ తెలిపారు. రేణిగుంట ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అర్హులైన సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఆరుగురు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.