కోనరావుపేట ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు.
సూర్య కోనరావుపేట :: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మానుక సత్యం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆమె చేసిన సేవలను, నాయకత్వాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో కోనరావుపేట పీఏసీఎస్ చైర్మన్ చేపూరి గంగాధర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, డైరెక్టర్లు అజీమ్ పాషా, బాశెట్టి నాగరాజు, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రాస రవీందర్, అతికం శ్రీనివాస్, పెంతల శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు ముదాం ప్రదీప్, దర్ర రవి, రవీందర్ రెడ్డి, కుమ్మరి దేవదాస్, మల్యాల మనోజ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.