BREAKING
నిజం గెలిచింది ..రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ నేషనల్ హైవే అంశంపై రాజకీయ విమర్శలు మానుకోవాలి: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు చింతకుంటలో విషాదం.. ఇద్దరు కుమారులతో సహా తల్లి మృతి ఇందిరా గాంధీకి భట్టి, వాకిటి నివాళులు భీమా పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి "శ్రీ త్యాగరాయ ఆచార్య గీతా" (గీతా సంగీత సమన్వయ లహరి) ఇందిరా గాంధీకి మంత్రి పొన్నం నివాళులు ఖర్గే నివాసంలో ప్రజా అభిశంసన.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ‘ఇండియా’ కూటమి నిరసన NHM ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి.. ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలకు అండగా నిలవండి -ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఎన్ హెచ్ ఎం జేఏసీ బాధ్యుల హృదయపూర్వక విజ్ఞప్తి ఎన్నికల సిబ్బందికి తీపి కబురు: పారితోషికం పెంపు.. జీవోలు జారీ చేసిన ప్రభుత్వం ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి స్ఫూర్తిదాయకం ఇందిరా పాలన మొదటి శాకాహార పండ్ల మేత డైనాసర్‌గా 'హెల్ చికెన్' గుర్తింపు మర్పల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం – దోసకాయల వెంకటేష్

Select Suryaa Now
దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం – దోసకాయల వెంకటేష్

శామీర్‌పేట, మేజర్ న్యూస్ :భారతదేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మూడు చింతలపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూర్ గ్రామంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, పేద ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి జగన్నాథం, నాయకులు గుర్రం బస్వారెడ్డి, బాలకృష్ణ చారి, నర్సారెడ్డి, జైపాల్ రెడ్డి, శిల్పా యాదగిరి, అనంతరెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటేశం, ఆంజనేయులు, రాజు, పండరి, నర్సింహులు, శ్రీకాంత్ గౌడ్, శ్రీశైలం, వీరేశం తదితరులు పాల్గొన్నారు.