BREAKING
మున్సిపల్ ఎన్నికల విధులపై పోలీస్ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 విజయవంతంపై ఇస్రోకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అభినందనలు చీమకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్ 2029 నాటికి దేశాన్ని పూర్తి డ్రగ్స్ రహితంగా మారుస్తామని అమిత్ షా ప్రతిజ్ఞ యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 151 వ జయంతి వేడుకలు ప్రపంచ ఆర్మ్‌వ్రిస్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన భారత్ వెబ్ కాస్టింగ్ వీక్షణకు విస్తృత ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఉత్తర బెంగాల్‌ను వణికించనున్న 'అర్నాబ్' తుఫాను ప్రభావం దేశంలో ఒక బిలియన్ మందికిపైగా సామాజిక భద్రత బీహార్‌కు భారీ వర్ష సూచన.. సీతామఢీ, మధుబని జిల్లాలకు రెడ్ అలర్ట్ దీపావళి కానుకగా నందమూరి బాలకృష్ణ 'దాదా' ఫస్ట్ సింగిల్... ఫ్యాన్స్‌కు అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్! ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం! అసోం పాడి, అగర్‌వుడ్ రైతులకు భారీ ఊరట పట్టా, ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి రైతు మట్టిని నమ్ముకుంటే.. నాయకులు మట్టిని అమ్ముకుంటున్నారా? తవ్వకాలు! వారణాసి-దిల్లీ మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

చేవెళ్ల మండల వార్డ్ మెంబర్స్ ఫోరం అధ్యక్షుడిగా చనగళ్ల శ్రీకాంత్

Select Suryaa Now
చేవెళ్ల మండల వార్డ్ మెంబర్స్ ఫోరం అధ్యక్షుడిగా చనగళ్ల శ్రీకాంత్

వార్డ్ మెంబర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: శ్రీకాంత్

చేవెళ్ల: తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం చేవెళ్ల మండల అధ్యక్షుడిగా చనగళ్ల శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం బోడుపల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి గ్యార సురేష్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నాగబెల్లి జ్యోతి, గ్యార సురేష్ మాట్లాడుతూ వార్డ్ మెంబర్ల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. చేవెళ్ల మండలంలో ఫోరంను మరింత బలోపేతం చేయడంలో చనగళ్ల శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలోని వార్డ్ మెంబర్లందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తా

మండల అధ్యక్షుడిగా నియమితులైన చనగళ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి, జిల్లా ఇన్‌చార్జి గ్యార సురేష్‌తో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. చేవెళ్ల మండలంలోని వార్డ్ మెంబర్ల సమస్యల పరిష్కారానికి, గ్రామస్థాయిలో వారి హక్కుల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫోరం బలోపేతానికి కృషి చేస్తూ వార్డ్ మెంబర్లకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.