BREAKING
నిజం గెలిచింది ..రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ నేషనల్ హైవే అంశంపై రాజకీయ విమర్శలు మానుకోవాలి: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు చింతకుంటలో విషాదం.. ఇద్దరు కుమారులతో సహా తల్లి మృతి ఇందిరా గాంధీకి భట్టి, వాకిటి నివాళులు భీమా పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి "శ్రీ త్యాగరాయ ఆచార్య గీతా" (గీతా సంగీత సమన్వయ లహరి) ఇందిరా గాంధీకి మంత్రి పొన్నం నివాళులు ఖర్గే నివాసంలో ప్రజా అభిశంసన.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ‘ఇండియా’ కూటమి నిరసన NHM ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి.. ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలకు అండగా నిలవండి -ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఎన్ హెచ్ ఎం జేఏసీ బాధ్యుల హృదయపూర్వక విజ్ఞప్తి ఎన్నికల సిబ్బందికి తీపి కబురు: పారితోషికం పెంపు.. జీవోలు జారీ చేసిన ప్రభుత్వం ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి స్ఫూర్తిదాయకం ఇందిరా పాలన మొదటి శాకాహార పండ్ల మేత డైనాసర్‌గా 'హెల్ చికెన్' గుర్తింపు మర్పల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

చీమకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్

Select Suryaa Now
 చీమకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్

చీమకుర్తి, మేజర్‌న్యూస్‌ :

చీమకుర్తి మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహణలో భాగంగా చీమకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఎన్నికల జనరల్ అబ్జర్వర్ శ్రీమతి కె.హెప్సిబా రాణి, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి శనివారం పరిశీలించారు. కౌంటర్లు, పోలింగ్ సామగ్రి పంపిణీ విభాగాలు, భద్రతా ఏర్పాట్లు మరియు సిబ్బంది కేటాయింపు ప్రక్రియలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. పూర్తిస్థాయిలో సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని సిబ్బందికి చెప్పారు. పోలింగ్ రోజు ఉదయం పోటీలో ఉన్న అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఖాళీ బ్యాలెట్ బాక్సులను చూపించి, వారి ముందే నిబంధనల ప్రకారం సీల్ చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ రహస్యత లోపించకుండా ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లను సరైన స్థలంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పంపిణీ, ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్ లను స్ట్రాంగ్ రూములకు తరలించే ప్రక్రియలో భద్రత పరంగా ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికల సంఘ మార్గనిర్దేశాలను పాటించాలని వారు స్పష్టం చేశారు.