విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
సూర్య, హుజురాబాద్. ప్రజలకు వైద్య సేవలు అందించే బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న అధికారులు, సిబ్బంది తమ విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించి, రోగులకు ఆసుపత్రిలో అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి వార్డుకు వెళ్లి అక్కడ ఉన్న సౌకర్యాలు, సౌకర్యాల గురించి సూపర్డెంట్ డాక్టర్ రవీందర్ ను అడిగి తెలుసుకున్నారు. లేబర్ రూమ్ వద్ద రిజిస్టర్ సక్రమంగా రాయకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ స్టోర్ రూమ్ లో స్టాకు కు, రిజిస్టర్ కు మధ్య తేడాలు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ఆమె పరిశీలించారు. అసంపూర్తిగా రిజిస్టర్లు ఉండడం పట్ల ఆమె అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. నిర్ణయించిన విధుల ప్రకారం కాకుండా ఎవరు పని చేయడం లేదు అన్నది ఆమె పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ కు హాజరైన డాక్టర్లు ఇతర సిబ్బంది గురించి ఆరా తీశారు. ఆస్పత్రి ముందు ప్రైవేటు అంబులెన్స్ లు ఉండకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి బాగు చేయడం కోసం 15 రోజులకు ఒకసారి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేస్తారని, వైద్యుల అధికారుల అటెండెన్స్ పై ఎఫ్ ఆర్ ఎస్ ప్రవేశపెడతామని అన్నారు. నెల రోజుల్లో ఆసుపత్రికి గాడిలో పెడతామని ఆమె అన్నారు. ఈ తనిఖీలలో ఆమె వెంట అసిస్టెంట్ కలెక్టర్ హరి ప్రసాద్, హుజురాబాద్ ఆర్డీవో జల కుమారి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ హఖీయోద్దీన్ ఖాన్, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ప్రభుదాస్, మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని, తాసిల్దార్ జక్కని నరేందర్, కమిషనర్ బి కిషన్, కౌన్సిలర్ కోయల్ కార్ భారతి, సిపిఐ రాష్ట్ర నాయకులు మర్రి వెంకటస్వామి తదితరులు ఉన్నారు