BREAKING
నిజం గెలిచింది ..రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది : టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ నేషనల్ హైవే అంశంపై రాజకీయ విమర్శలు మానుకోవాలి: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు చింతకుంటలో విషాదం.. ఇద్దరు కుమారులతో సహా తల్లి మృతి ఇందిరా గాంధీకి భట్టి, వాకిటి నివాళులు భీమా పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి "శ్రీ త్యాగరాయ ఆచార్య గీతా" (గీతా సంగీత సమన్వయ లహరి) ఇందిరా గాంధీకి మంత్రి పొన్నం నివాళులు ఖర్గే నివాసంలో ప్రజా అభిశంసన.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ‘ఇండియా’ కూటమి నిరసన NHM ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి.. ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలకు అండగా నిలవండి -ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఎన్ హెచ్ ఎం జేఏసీ బాధ్యుల హృదయపూర్వక విజ్ఞప్తి ఎన్నికల సిబ్బందికి తీపి కబురు: పారితోషికం పెంపు.. జీవోలు జారీ చేసిన ప్రభుత్వం ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి స్ఫూర్తిదాయకం ఇందిరా పాలన మొదటి శాకాహార పండ్ల మేత డైనాసర్‌గా 'హెల్ చికెన్' గుర్తింపు మర్పల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

విద్యార్థినుల పై రంపం తో దాడి చేయడం దారుణం*... పిడిఎస్యు డిమాండ్

Select Suryaa Now
విద్యార్థినుల పై రంపం తో దాడి చేయడం దారుణం*... పిడిఎస్యు డిమాండ్

విద్యార్థినుల పై రంపంతో  దాడి చేయడం దారుణం*

పిడిఎస్యు 
 

హిందూపురం:- అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో చోటుచేసుకున్న ఉన్మాది దాడి ఘటనను పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు బాబావలి తీవ్రంగా ఖండించారు.తరగతి గదిలోకి చొరబడిన ఉన్మాది విద్యార్థిని పై రంపంతో దాడి చేయడంతో పాటు, అడ్డొచ్చిన మరో విద్యార్థిని పై కూడా దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురై కన్నీళ్లు పెట్టుకోవడం హృదయవిదారకమని అన్నారు. పాఠశాలల్లోనే విద్యార్థులకు రక్షణ లేకపోవడం ప్రభుత్వ భద్రతా వైఫల్యాలకు నిదర్శనమని విమర్శించారు.
ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపి దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.విద్యార్థుల ప్రాణాలకు భరోసా కల్పించలేని విద్యావ్యవస్థ ఎవరి కోసం? ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని బాబావలి డిమాండ్ చేశారు...

హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర