BREAKING
కాలిఫోర్నియాలో ఉత్కంఠ రేపుతున్న ICE దాడులు *పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన సర్పంచ్ చింతలపల్లి విజయ-రాజారెడ్డి* బీసీ ఉద్యమకారులను గుర్తించాలిః మట్టా జయంతి గౌడ్ చికెన్ ధరలు ధమాల్.. సింగారం మూవీ రివ్యూ: కమెడియన్ యోగి బాబు హీరోగా నటించిన తాజా సినిమా ఎలా ఉందంటే! వాల్ స్ట్రీట్ నుంచి ఆసియా స్టాక్ మార్కెట్ల వరకు కొనసాగుతున్న ఒడుదొడుకులు ఎన్నికల విధులకై... సర్వ సన్నద్ధమై..!! రాప్తాడు లో విద్యార్థి పై చేసిన దాడి ని తీవ్రంగా ఖండిస్తున్నాం… ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి జాతీయ అవార్డు గ్రహీత. ఖాజా వలి కి ఘనంగా సత్కారం. అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ ఉత్కంఠ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి నిందితుడిపై కఠిన చర్యలకు డిమాండ్ అకాల వర్షంతో అన్నదాతల ఆగమాగం చేతికొచ్చిన పంట నేలపాలు.. రైతులకు తీరని నష్టం..! విదేశీ బ్రాండ్లతో పాటు గొళం విప్పుతున్న దేశీయ మద్యం దిగ్గజాలు సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘనంగా "రన్ ఫర్ యూనిటీ"

పంజాబ్ ఎన్నికల వేడి: ఆప్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల..

Select Suryaa Now
పంజాబ్ ఎన్నికల వేడి: ఆప్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల..

 

చండీగఢ్:పంజాబ్ రాబోయే శాసనసభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ముందస్తుగా సమరశంఖం పూరించింది. ఎన్నికల వేడి పెంచుతూ తొలి విడతగా 40 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధిష్టానం శనివారం విడుదల చేసింది. ఈ తొలి జాబితాలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ పోటీ చేసే స్థానాన్ని స్పష్టం చేశారు. సీఎం మాన్ తన సొంత నియోజకవర్గమైన ధురి అసెంబ్లీ స్థానం నుంచే మళ్లీ బరిలోకి దిగనున్నారు.

పార్టీ ప్రకటించిన 40 మంది అభ్యర్థుల జాబితాలో అత్యధికులు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకే చోటు దక్కింది. ఎన్నికలకు తగినంత సమయం ఉన్నప్పటికీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా ప్రచారంలో ముందంజ వేయవచ్చని ఆప్ భావిస్తోంది. ఈ సందర్భంగా పోటీలో నిలిచిన అభ్యర్థులకు సీఎం భగవంత్ మాన్ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజల మద్దతుతో పార్టీ భారీ విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. మిగిలిన స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాలను త్వరలోనే విడతల వారీగా విడుదల చేయనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి.