నేరాల కట్టడికి కార్డన్ సెర్చ్
సూర్య శంకరపట్నం: గ్రామాల్లో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, అనుమానితుల గుర్తింపే లక్ష్యంగా కేశవపట్నంలో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హుజూరాబాద్ సబ్‌డివిజన్ పరిధిలో 40 మంది సిబ్బంది, రెండు ప్రత్యేక బృందాలతో ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 65 ద్విచక్ర, 4 త్రిచక్ర, 3 నాలుగు చక్రాల వాహనాలు కలిపి 72 వాహనాలను సీజ్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఏసీపీ మాధవి కోరారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.