పర్యావరణ పరిరక్షణలో నేరేడుచర్ల పీఎం శ్రీ పాఠశాలకు ప్రథమ బహుమతి ఉపాధ్యాయులు, విద్యార్థుల సమిష్టి కృషికి దక్కిన గుర్తింపు
పర్యావరణ పరిరక్షణలో నేరేడుచర్ల పీఎం శ్రీ పాఠశాలకు ప్రథమ బహుమతి
ఉపాధ్యాయులు, విద్యార్థుల సమిష్టి కృషికి దక్కిన గుర్తింపు
నేరేడుచర్ల, మేజర్ న్యూస్
పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలకు గుర్తింపుగా సీజీఆర్ (కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో నేరేడుచర్లలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లా స్థాయి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలలో పచ్చదనం పెంపొందించడం, మొక్కలు నాటడం, పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు, వారిని కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమిష్టి కృషి, అంకితభావం వల్లే ఈ అవార్డు సాధ్యమైందని తెలిపారు. అనంతరం పాఠశాల తరపున అవార్డు స్వీకరించిన పీడీ యంగ్ ఎర్త్ లీడర్స్ మెంటర్ఎం యాదగిరి . అలాగే ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.