కొమ్మమూరు కాలువ పై బ్రిడ్జికి రూ.68 కోట్లు మంజూరు.......ఎమ్మెల్యే ధూళిపాళ్ల
పొన్నూరు మేజర్ న్యూస్:- గుంటూరు-చీరాల ప్రధాన రహదారిలో కొమ్మమూరు కాలువపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.68 కోట్లకు ప్రభుత్వ అనుమతులు లభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు.
1865లో నిర్మించిన పాత వంతెన 2017లో దెబ్బతినడంతో 2018లో టీడీపీ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందని, ఇలాండ్ వాటర్వేస్ అథారిటీ నిబంధనలు డిజైన్ మార్పులతో వ్యయం రూ.68 కోట్లకు పెరిగిందని, తాజాగా కూటమి ప్రభుత్వం సవరించిన అంచనాలకు అనుమతులు ఇచ్చిందని చెప్పారు. ఇటీవల భారీ వాహనం ఢీకొని దెబ్బతిన్న బ్రిడ్జికి రూ.24.90 లక్షలతో మరమ్మతులు పూర్తి చేశామని, నూతన బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్