BREAKING
ఏదో ఒక రోజు ‌మల్కాపూర్ స్వచ్ఛభారత్ ప్రధాని దృష్టికి వెళుతుంది ముఖ్యఅతిథిగా తూప్రాన్ డిఎల్పిఓ సాయిబాబా ఉప సర్పంచ్ స్వామి కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ది జలదంకి లో జన ప్రభంజనం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఏఎస్ పేటలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి హబీబ్ భాషా బెంగళూరు ఫైవ్‌స్టార్ హోటల్ పూల్‌లో అనుమానాస్పద రీతిలో జర్మన్, స్లోవాక్ జాతీయుల మృతి! పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండా పిరికిపందలా పారిపోయారు : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరవాడ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి వివాహ వేడుకలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మాగుంట లేఔట్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల నిశ్చితార్థ వేడుకకు హాజరైన శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం --పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ మలబార్ ఉద్యోగుల స్వచ్ఛ భారత్ పోలింగ్ సరళిని పరిశీలించిన తారక్ నాథ్ రెడ్డి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల చీరాల, రేపల్లెలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు చీరాలలో 72.69 శాతం.. రేపల్లెలో 69.65 శాతం పోలింగ్

లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు.. ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, క్రీడా సామాగ్రి అందజేత

Select Suryaa Now
లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు.. ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, క్రీడా సామాగ్రి అందజేత

సూర్య - మానకొండూర్ : లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ 320జి ఆధ్వర్యంలో మానకొండూర్‌లో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా గవర్నర్ లయన్ మోర భద్రేశం అధికారిక పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమాలను చేపట్టారు. విద్య, క్రీడలు, సామాజిక చైతన్యం పట్ల తమ క్లబ్‌కు ఉన్న నిబద్ధతను చాటుకుంటూ ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాయి.ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో చదువుపై ఆసక్తిని పెంచే ఉద్దేశంతో ఏకంగా 1,001 పుస్తకాలను పంపిణీ చేయడంతో పాటు, విద్యార్థుల శారీరక ఉల్లాసం కోసం క్రీడా సామాగ్రిని అందజేశారు. అంతేకాకుండా, మానకొండూర్‌లోని మూడు అంబేద్కర్ కమ్యూనిటీ కేంద్రాలకు ప్రజల్లో దైనందిన విషయాలపై అవగాహన పెంపొందించేందుకు రోజూవారీ దినపత్రికలను బహూకరించారు. ఇదే వేదికపై లయన్స్ క్లబ్ ద్వారా విద్యా సహాయం పొందుతున్న ఒక బాలికకు చదువుల నిమిత్తం ఆర్థిక సహాయ చెక్కును అందజేసి అండగా నిలిచారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజలకు సహాయపడటమే లయన్స్ క్లబ్ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జి.వి.రామకృష్ణారావు, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ జిల్లా 320జి అధ్యక్షుడు లయన్ మైదారం శివకాంత్, లయన్ బత్తో వినోద్, లయన్ కృష్ణ చైతన్య, ఆర్.సి.ఆర్.ఎస్.పి. రెడ్డి, జెడ్.సి.ముక్కా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.