BREAKING
కొమ్మమూరు కాలువ పై బ్రిడ్జికి రూ.68 కోట్లు మంజూరు.......ఎమ్మెల్యే ధూళిపాళ్ల భారత మహిళా క్రికెట్‌కు అరుదైన ఘనత... యాభై ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసిన బీసీసీఐ! పంజాబ్ ఎన్నికల వేడి: ఆప్ తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల.. చరిత్ర సృష్టించిన ఐరిష్ బౌలర్... వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదు చేసిన జై మూంద్ర! ర్యాపిడో డెలివరీ బాయ్ హస్తలాఘవం: రూ.62 వేల బంగారు నగలతో పరారీ! సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ... యూఏఈ చేతిలో ఘోర ఓటమి! మానకొండూరులో ఘనంగా రేమిడి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి ఎంపికలు హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో విధ్వంసం... శ్రీలంకపై సంచలన విజయం సాధించిన స్కాట్లాండ్! నియోజకవర్గ స్థాయి మాక్ అసెంబ్లీకి ముగ్గురు విద్యార్థులు ఎంపిక. టెస్టు క్రికెట్‌లో అరుదైన మైలురాయి... వంద వికెట్ల క్లబ్‌లో చేరిన వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్! భారత్ ఏ జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ అద్భుత పోరాటం... ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్! న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కీలక మార్పు... భారత జట్టులోకి యువ పేసర్ ఆకిబ్ నబీ ఎంట్రీ! చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్‌గా మహేందర్ నందారి నియామకం

బీఎస్పీ ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా తాళ్లమాపురం కమాల్ బాషా, ఉపాధ్యక్షురాలిగా షేక్ షబానా నియామకం

Select Suryaa Now
బీఎస్పీ ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా తాళ్లమాపురం కమాల్ బాషా, ఉపాధ్యక్షురాలిగా షేక్ షబానా నియామకం

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు, పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో నూతన నియోజకవర్గ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు కొనసాగుతున్న అసెంబ్లీ పాత కమిటీని రద్దు చేసి, నూతన కమిటీని నియమించినట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. కడప జిల్లా అధ్యక్షులు సగిలి గుర్రప్ప, పార్లమెంట్ ఇన్‌చార్జి డీఎస్ జయరామ్, జిల్లా కార్యదర్శి, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి తీట్ల రవికుమార్ ఆధ్వర్యంలో ఈ నూతన కార్యవర్గ నియామక కార్యక్రమం నిర్వహించారు. ప్రొద్దుటూరులోని ఆంధ్రకేసరి రోడ్డులో ఉన్న బీఎస్పీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన నియామకాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా తాళ్లమాపురం కమాల్ బాషాను, నియోజకవర్గ ఉపాధ్యక్షురాలిగా షేక్ షబానాను నియమించారు. నూతనంగా నియమితులైన నాయకులు పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ, బహుజన వర్గాల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పార్టీ నాయకులు సూచించారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు అణగారిన వర్గాల ప్రజలను సంఘటితం చేయడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా నాయకులు బేబీ, మేరీ, మైదుకూరు నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కర్, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి తీట్ల రవికుమార్‌తో పాటు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా