పోలింగ్ విధులపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి / యలమంచిలి, అక్టోబర్ 31: గుర్రప్ప కల్యాణ మండపంలో శనివారం ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల నిర్వహణపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్ ఈ కార్యక్రమంలో కార్యక్రమానికి హాజరై ఎన్నికల విధులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ రోజున ప్రతి అధికారి ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, , బ్యాలెట్ బాక్సుల వినియోగం, ఎన్నికల సంబంధిత ఓటు పత్రాల నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియను మి నిర్చితముగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, పి జె ఎస్పీ రాజు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రవీంద్ర ధామ జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ విభాగం సిబ్బంది, ట్రైనీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రవికుమార్
ఎన్టిపి సూర్య ప్రతినిధి
అనకాపల్లి జిల్లా