చిత్తూరు మండలంలో కూటమి ఇంటింటి ప్రచారం - బిఎన్ఆర్ పేటలో సుడిగాలి పర్యటన - ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పిటిసి అభ్యర్థి మంజుల శశికర్ బాబు
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:చిత్తూరు మండలం బిఎన్ఆర్ పేట గ్రామ పంచాయతీలో శనివారం కూటమి నాయకులు ప్రచారం నిర్వహించారు.ముత్తుకూరు ఎంపీపీ అభ్యర్థి జయ చంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు, అనంతపురం ఎంపీటీసీ అభ్యర్థి జ్యోతి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేశారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ, రైతు భరోసా పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తున్న విషయాన్ని వివరించారు.ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు మాట్లాడుతూ మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఎంపీపీ అభ్యర్థి జయ చంద్ర నాయుడు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు. గ్రామంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బిఎన్ఆర్ పేటలో ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మోహన్ రాజ్, శ్రీకాంత్, శ్రీనివాసులు, మనోహర్ నాయుడు, రఘు, ముత్తుకూరు మోహన్, గిరి, రాము, నీలకంఠ నాయుడు, దేవరాజులు, బాలాజీ, ప్రిన్స్ , శరవణ, కంద స్వామి, రమేష్, చల్ల, నాగరత్నం, రెడ్డప్ప, మేషాక్, యోయ, మైకేల్, నయాజ్, తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్