వెల్దుర్తిలో రేపు వైఎస్‌ఆర్సీపీ ప్రెస్ మీట్
వెల్దుర్తి, (సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కీలక సమావేశానికి పిలుపునిచ్చారు. ఆదివారం (నవంబరు 1) ఉదయం 10:30 గంటలకు వైఎస్‌ఆర్సీపీ మండల కన్వీనర్ బొమ్మన రవి రెడ్డి తన స్వగృహంలో ‘ప్రెస్ మీట్’ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలు, పార్టీ వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. కావున ఈ ప్రెస్ మీట్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వెల్దుర్తి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వెల్దుర్తి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో కోరారు.
సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం