andhrapradesh
వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు
కడప జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయని వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. కూటమి నేతలు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని, తమ పార్టీకి చెందిన 900 మందికి పైగా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని విమర్శించారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కడప, పులివెందుల నియోజకవర్గాల్లో వైసీపీని రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు తావులేకుండా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.