BREAKING
దేశంలో ఒక బిలియన్ మందికిపైగా సామాజిక భద్రత బీహార్‌కు భారీ వర్ష సూచన.. సీతామఢీ, మధుబని జిల్లాలకు రెడ్ అలర్ట్ దీపావళి కానుకగా నందమూరి బాలకృష్ణ 'దాదా' ఫస్ట్ సింగిల్... ఫ్యాన్స్‌కు అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్! ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం! అసోం పాడి, అగర్‌వుడ్ రైతులకు భారీ ఊరట పట్టా, ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి రైతు మట్టిని నమ్ముకుంటే.. నాయకులు మట్టిని అమ్ముకుంటున్నారా? తవ్వకాలు! వారణాసి-దిల్లీ మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ విజయ్ సేతుపతి 'ట్రెయిన్' సినిమా విడుదల తేదీ ఖరారు... డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి! దేశవ్యాప్తంగా 490 మంది పోలీసు సిబ్బందికి 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్-2026' ప్రకటన దేశ ఐక్యత, సమగ్రత కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం – దోసకాయల వెంకటేష్ విద్యార్థినుల పై రంపం తో దాడి చేయడం దారుణం*... పిడిఎస్యు డిమాండ్ జీ20 సదస్సు వేదికగా విదేశీ మంత్రులతో ఎస్ జైశంకర్ భేటీలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీకి అగ్రస్థానం వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నాలుగు రోజుల పాదయాత్రకు ప్రజల ఆదరణే కొండంత బలం – ఏనుగు సుదర్శన్ రెడ్డి

వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన భాస్కర్ రెడ్డి మృతి తీరని లోటు: మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి

Select Suryaa Now
వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన భాస్కర్ రెడ్డి మృతి తీరని లోటు: మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : పట్టణంలోని కోటవీధికి చెందిన చెన్నూరు భాస్కర్ రెడ్డి శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పచ్చల పుల్లయ్య, 8వ వార్డు కౌన్సిలర్ గాండ్ల వినీత, తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్‌చార్జి గాండ్ల నారాయణస్వామి తదితరులు చెన్నూరు వారి వీధిలోని భాస్కర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన భౌతికకాయంపై పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాస్కర్ రెడ్డి వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు, స్థానికంగా అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు పొందారని తెలిపారు. మంచి మనసు, సౌమ్య స్వభావం, ఉత్తమ నడవడిక కలిగిన భాస్కర్ రెడ్డి అందరితో ఆత్మీయంగా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులకే కాకుండా బంధుమిత్రులకు, స్థానికులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు, బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని భాస్కర్ రెడ్డికి నివాళులర్పించారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా