వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు, ఎమ్మెల్సీ సిపాయి ప్రచారం.
రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట మండలం కరకంబాడి తారకరామా నగర్‌లో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి గంగారి సుజాత, ఎంపీటీసీ అభ్యర్థులు నాగరాజు, హేమలత, దిలీప్‌ల విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓటు ద్వారా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, తిరుమలరెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, రమేష్, శ్రీధర్ రెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.