BREAKING
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏపీకి అగ్రస్థానం వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నాలుగు రోజుల పాదయాత్రకు ప్రజల ఆదరణే కొండంత బలం – ఏనుగు సుదర్శన్ రెడ్డి జేన్ ఆస్టిన్ క్లాసిక్ నవల ఆధారంగా 'సెన్స్ అండ్ సెన్సిబిలిటీ'... సరికొత్తగా మెప్పించిన డ్రామా! భారత్-బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత దూకుడు పోలీసులఅమర వీరుల దినోత్సవము,,, పోలీసులకుసంఘీ భావంగారక్తదానం..... వివాదంలో విక్టరీ వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం'... అనుమతి లేకుండా పాట వాడారంటూ నిర్మాత ఆవేదన! కోనరావుపేట ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు. మంచిర్యాలలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి: డీసీపీ ఎ.భాస్కర్ బియ్యం షాపులపై అధికారుల దాడులు.. అహోబిలేసునికి పూజ నిర్వహించిన తెదేపా జడ్పిటిసి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ఓటీటీలోకి రాబోతున్న దుల్కర్ సల్మాన్ క్రేజీ థ్రిల్లర్... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! పనులను సకాలం లో పూర్తి చేయాలి వెల్దుర్తిలో రేపు వైఎస్‌ఆర్సీపీ ప్రెస్ మీట్ మెగా కాంబో చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన సాత్విక వీరవల్లి... రామ్ చరణ్ సినిమాపై భారీ అంచనాలు!

రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన ఫెయిత్ స్కూల్ విద్యార్థులు

Select Suryaa Now
రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన ఫెయిత్ స్కూల్ విద్యార్థులు

రాజమహేంద్రవరం, అక్టోబర్ 31:  విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, సేవాభావాన్ని, ఉన్నత విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో తమ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకునేలా ప్రేరణ కల్పించే ఉద్దేశ్యంతో రాజమహేంద్రవరం విద్యానగర్‌లోని ఫెయిత్  ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన 8వ తరగతి వరకు చదువుతున్న 52 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు 31.10.2026న ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరాన్ని విద్యా విహారయాత్రలో భాగంగా సందర్శించారు.
పాఠశాల కరస్పాండెంట్లు శ్రీ G.S. మోసెస్, శ్రీమతి B. కమల శ్రేయేయిన్ శ్రీ G. బ్రెయిన్  మోసెస్  ప్రోత్సాహము మరియు మార్గదర్శకత్వంలో ఈ సందర్శన జరిగింది. తొలుత విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. M.S. రాజును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. M.S. రాజు మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థలను సందర్శించడం ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయమని పేర్కొన్నారు. ఇటువంటి సందర్శనలు విద్యార్థుల ఆలోచనా పరిధిని విస్తృతం చేసి, జీవితంలో ఉన్నత ఆశయాలను ఏర్పరచుకోవడానికి, వాటి సాధన దిశగా కృషి చేయడానికి దోహదపడతాయని తెలిపారు. పేదలకు, నిరుపేదలకు నిజమైన సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారు వైద్యవృత్తిని ఒక గొప్ప అవకాశంగా ఎంచుకోవచ్చని, అందుకోసం విద్యార్థులు పట్టుదలతో చదివి వైద్య విద్యను అభ్యసించాలని సూచించారు. భవిష్యత్తులో ఈ కళాశాలలోనే కొంతమంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఉన్నత లక్ష్యాల సాధనలో ఉపాధ్యాయులు కూడా నిరంతరం ప్రోత్సాహం అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
అనంతరం కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. V.V. దుర్గాప్రసాద్ విద్యార్థులతో ప్రేరణాత్మకంగా మాట్లాడి, వైద్యవృత్తి ప్రాముఖ్యత, ఆరోగ్య పరిరక్షణ, సమాజ సేవ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడటంలో కీలకమైన  సి . పి.ఆర్.(Cardiopulmonary Resuscitation) పై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రత్యక్ష ప్రదర్శనతో పాటు చేతుల మీదుగా శిక్షణ అందించారు.
ఈ సందర్శనలో భాగంగా విద్యార్థులు వైద్య కళాశాలలోని మ్యూజియం, స్కిల్ ల్యాబ్‌తో పాటు వివిధ వైద్య విభాగాలను సందర్శించి వైద్య విద్య, వైద్య పరికరాలు, వైద్యుల సేవలు, అత్యవసర వైద్య విధానాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. విద్యార్థులు కు చేతులు శుభ్రం చేసుకునే విధానము , అందులో గల పద్ధతులు ప్రదర్శన చేసి చూపించారు . వాక్సినేషన్ పై కూడా విద్యార్థులకు అవగాహన కలిగించారు..
ఈ విద్యా విహారయాత్ర విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు ప్రత్యక్ష అనుభవాన్ని అందించి, వైద్యవిద్య పట్ల ఆసక్తిని, సమాజ సేవ పట్ల బాధ్యతను, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించాలనే స్ఫూర్తిని కలిగించిందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
ఈ కార్యక్రమంలో  కమ్యూనిటీ మెడిసిన్ విభాగము ప్రొఫెసర్ డా బి శ్రీనివాస్ నాయక్, 
అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా సురేంద్ర, డా వి సూర్యారావు, డా దీప్తి ,డా. ఉదయ్ కుమార్, సామాజిక శాస్త్రోపన్యాసకులు ప్రసన్న, మూర్తి, శాస్త్రి, శ్రీనివాస్, విజయ్ మరియు ఫెయిత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల, రాజమహేంద్రవరం ఉపాధ్యాయులు టి.. జానకి, పి .కావ్య, ఆర్. పుష్ప, టి. రోజా, ఏం.. హర్షిత, ఏ .అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


జారీ చేసినవారు 
హోదా డిపార్ట్ మెంట్ అఫ్ కమ్యూనిటీ మెడిసిన్, GMC రాజమహేంద్రవరం.