BREAKING
చరిత్ర సృష్టించిన ఐరిష్ బౌలర్... వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదు చేసిన జై మూంద్ర! ర్యాపిడో డెలివరీ బాయ్ హస్తలాఘవం: రూ.62 వేల బంగారు నగలతో పరారీ! సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ... యూఏఈ చేతిలో ఘోర ఓటమి! మానకొండూరులో ఘనంగా రేమిడి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి ఎంపికలు హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో విధ్వంసం... శ్రీలంకపై సంచలన విజయం సాధించిన స్కాట్లాండ్! నియోజకవర్గ స్థాయి మాక్ అసెంబ్లీకి ముగ్గురు విద్యార్థులు ఎంపిక. టెస్టు క్రికెట్‌లో అరుదైన మైలురాయి... వంద వికెట్ల క్లబ్‌లో చేరిన వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్! భారత్ ఏ జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ అద్భుత పోరాటం... ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్! న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కీలక మార్పు... భారత జట్టులోకి యువ పేసర్ ఆకిబ్ నబీ ఎంట్రీ! చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్‌గా మహేందర్ నందారి నియామకం టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు... ఆసీస్‌పై లోయర్ ఆర్డర్‌లో సెంచరీలతో చెలరేగిన సౌతాఫ్రికా బ్యాటర్లు! ముంచుకొస్తున్న తుఫాన్‌ ముప్పుఏపీ నెత్తిన మరో బాంబు.. ! శింబు 50వ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. పోలీస్‌గా ఎస్‌టీఆర్, కీలక పాత్రలో నయనతార!

ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం...

Select Suryaa Now
ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం...


వీణవంక: భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని  వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవానికి ప్రోత్సాహం, వ్యవసాయ రంగ అభివృద్ధి వంటి కీలక నిర్ణయాల్లో ఆమె పాత్ర ఉందని గుర్తుచేశారు.
దేశంలో పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలకు ఆమె తన పాలనలో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలు, ఆమె తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని నాయకులు తెలిపారు. ఆమె ఆశయాల సాధనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, గంగాడి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వావిలిన సత్యనారాయణ. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, గెల్లు శ్రీనివాస్ యాదవ్, గంగాడి రాజిరెడ్డి, ఐలయ్య యాదవ్, ఎల్లారెడ్డి, మాదాసి సునీల్ డైరెక్టర్, రషీద్, అందే కుమార్, మహేష్ గౌడ్, రమేష్, గట్టయ్య,
శ్రీనివాస్ గౌడ్, మోటం శ్రీనివాస్,మధుసూదన్. లక్ష్మణ్, ఆవల రామకృష్ణ
పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.