రాప్తాడులో విద్యార్థిని పై దాడి చేసిన ఉన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాల డిమాండ్
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై దాడి చేసిన ఉన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు లోని ప్రగతిశీల విద్యార్థి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ ఓబులేసు కత్తి, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ జగదీష్ లు విలేకరులతో మాట్లాడుతూ సమాజంలో ఆడవారిపట్ల విద్యార్థినిల పట్ల దాడులు ఎక్కువయ్యాయని దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల ఒక ఉన్మాది చెట్లను కోసే మిషన్ తీసుకొని వచ్చి తరగతి గదిలో ఉన్న విద్యార్థినీల మధ్య భయభ్రాంతులకు గురి చేస్తూ అతి కిరాతకంగా విద్యార్థిని పై దాడి చేయడం అలాగే మరొక విద్యార్థిని దాడిని ఎదురుకోబోయే సమయంలో ఆ అమ్మాయి పట్ల దాడికి పాల్పడడం చాలా హేయమైన చర్య అని విద్యార్థి యువజన సంఘాలుగా ఖండిస్తున్నామని తెలిపారు. విద్యార్థినిలపట్ల దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలతో పాటు వెంటనే కఠిన చట్టాలతో అతనిని అరెస్టు చేసి విద్యార్థినీలకు రక్షణ కల్పించాలని అనంతపురం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రి ని కోరారు.
- షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా