పదవి విరమణ పొందిన అమ్రాబాద్ ఎస్సై హన్మంత్ రెడ్డికి ఘనంగా సన్మానం చేసిన- నాగర్ కర్నూలు జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు.
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి, ప్రస్తుతం అమ్రాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) గా విధులు నిర్వహిస్తున్న హన్మంత్ రెడ్డి శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో (DPO) ప్రత్యేక వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎన్. వెంకటేశ్వర్లు పదవీ విరమణ పొందిన ఎస్సై హన్మంత్ రెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారూ. అనంతరం మాట్లాడుతూ
"ప్రజల రక్షణ, భద్రతల కోసం 38 సంవత్సరాల పాటు నిష్టతో, నిజాయితీ, క్రమశిక్షణ మరియు అంకితభావంతో పోలీసు శాఖలో హన్మంత్ రెడ్డి గారు అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆయన వృత్తి జీవితంలో సాధించిన విజయాలు, సంపాదించిన గౌరవం, ప్రజల అభిమానమే ఆయన అందించిన ఉత్తమ సేవలకు నిదర్శనం. పదవీ విరమణ అనేది వృత్తిపరమైన సేవలకు ముగింపు మాత్రమే తప్ప, జీవితానికి కాదని అన్నారు . అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా రిటైర్డ్ ఎస్ఐ హన్మంత్ రెడ్డిని ప్రత్యేకంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ డిఎస్పి శ్రీనివాస్, AO కృష్ణయ్య, నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ వెల్ఫేర్ సంఘం అధ్యక్షుడు హెడ్ కానిస్టేబుల్ చిన్ను నాయక్, జిల్లా పోలీస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పి వినయ్ కుమార్, నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్