BREAKING
చరిత్ర సృష్టించిన ఐరిష్ బౌలర్... వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదు చేసిన జై మూంద్ర! ర్యాపిడో డెలివరీ బాయ్ హస్తలాఘవం: రూ.62 వేల బంగారు నగలతో పరారీ! సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ... యూఏఈ చేతిలో ఘోర ఓటమి! మానకొండూరులో ఘనంగా రేమిడి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయి ఎంపికలు హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో విధ్వంసం... శ్రీలంకపై సంచలన విజయం సాధించిన స్కాట్లాండ్! నియోజకవర్గ స్థాయి మాక్ అసెంబ్లీకి ముగ్గురు విద్యార్థులు ఎంపిక. టెస్టు క్రికెట్‌లో అరుదైన మైలురాయి... వంద వికెట్ల క్లబ్‌లో చేరిన వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్! భారత్ ఏ జట్టు కెప్టెన్ ధ్రువ్ జురెల్ అద్భుత పోరాటం... ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్! న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కీలక మార్పు... భారత జట్టులోకి యువ పేసర్ ఆకిబ్ నబీ ఎంట్రీ! చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్‌గా మహేందర్ నందారి నియామకం టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు... ఆసీస్‌పై లోయర్ ఆర్డర్‌లో సెంచరీలతో చెలరేగిన సౌతాఫ్రికా బ్యాటర్లు! ముంచుకొస్తున్న తుఫాన్‌ ముప్పుఏపీ నెత్తిన మరో బాంబు.. ! శింబు 50వ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. పోలీస్‌గా ఎస్‌టీఆర్, కీలక పాత్రలో నయనతార!

గాయపడిన విద్యార్ధి తల్లిని, ఫోన్లో పరామర్శించిన ముఖ్యమంత్రి.

Select Suryaa Now
గాయపడిన విద్యార్ధి తల్లిని, ఫోన్లో పరామర్శించిన ముఖ్యమంత్రి.

అనంతపురం: రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. బాధిత విద్యార్థిని తల్లితో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడిని పట్టుకుని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, చికిత్సలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యార్థినుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తమ వంతు కృషి చేయాలని కోరారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. విద్యార్థినులపై జరిగిన దాడి పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా బాధిత కుటుంబంతో మాట్లాడి భరోసా ఇవ్వడం, వైద్య సేవలపై అధికారులకు ఆదేశాలు జారీ చేయడం బాధిత కుటుంబానికి కొంత ధైర్యాన్ని కల్పించింది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ += బోయ రంగస్వామి.