అత్యవసర సమయాల్లో రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది
అత్యవసర సమయాల్లో రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది
* కందుకూరు సిఐ వెంకటేశ్వర్లు
కందుకూరు: అత్యవసర సమయాల్లో రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కందుకూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో శనివారం మహేశ్వరం సుమంగళి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రావిచెట్టు అరుణ్ కుమార్, పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ... రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, యువకులు అనేగౌని రాఘవేందర్ గౌడ్ , పడకండి ప్రసాద్, తాండ్ర మణికాంత్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన అరుణ్ కుమార్ తో పాటు పలువురు యువకులను పోలీస్ అధికారులు అభినందించారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్