వివాహ కార్యక్రమంలో పాల్గొన్నడాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - లలిత్ సాగర్ దంపతులు.
సూర్య న్యూస్ దర్శి.
మండలంలోని తానంచింతల గ్రామంలో కోమిరిశెట్టి సత్యనారాయణ బాలశివ కుమారుని వివాహ కార్యక్రమానికి దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - లలిత్ సాగర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి నివాసం లో ఏర్పాటు చేసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం నూతన వధూవరులు రామకృష్ణ - సాయి ప్రియ లను కలసి పుష్పగుచ్ఛం అందజేసి వివాహా శుభాకాంక్షలు తెలియజేసి, ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో దర్శి పట్టణ టిడిపి అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, టిడిపి నాయకులు కొమిరిశెట్టి సుభ్రమణ్యం, వారితో పాటు స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.