కొత్తపెళ్లి గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి 75 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమ ఇసుక, నాలుగు డంపర్లు స్వాధీనం
సూర్య తిమ్మాపూర్: ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపెళ్లి గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు డంపర్ల ఇసుకతో పాటు సుమారు 75 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సురేందర్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సురేంద్ర, పాల్‌సింగ్, మల్లేశం, కానిస్టేబుళ్లు సాయిదీప్, విశ్వతేజ ఈ దాడిలో పాల్గొన్నారు. అక్రమ ఇసుక నిల్వలు, రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు.