అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం
మణుగూరు ఆర్ సి సూర్య ; మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే,తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు.రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని,అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం