శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం
సూర్య,బెజ్జుర్ : ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ గోపురం నిర్మాణంతో పాటు మరుగుదొడ్లు, బాత్రూంలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పనులు చేపడుతున్నట్లు ఆలయ అధ్యక్షుడు తంగేడిపల్లి మహేష్ తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.