BREAKING
తెలంగాణ రక్షణ సేన (TRS) దళిత వింగ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చంటి శ్రీనివాస్ నియామకం పుట్టపర్తిలో కూటమి అభ్యర్థిని గెలిపించండి తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికల కోఆర్డినేటర్‌గా జెల్లోజి శ్రీనివాస్ పటేల్ నియామకం అవతారపురుషుడా.. రాజకీయ ప్రతీకా? పరశురాముడి పురాణం వెనుక మరో కోణం ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణే లక్ష్యం.... జిల్లా ఎస్పీ ఎస్ .సతీష్ కుమార్ అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి:మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ బ్యాంక్ ఖాతాదారులందరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి .. నగరవాసుల ప్రాణాలు హరిస్తున్న జవహర్ నగర్ డంప్ యార్డ్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు నేటి రాశి ఫలాలు: అక్టోబర్ 30, 2026 (శుక్రవారం) – ఏ రాశి వారికి ధనలాభం? ఎవరికి పని ఒత్తిడి? అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి.. డీఎస్పీ రవిబాబు.. ఘనంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. 8వ వార్డులో జనసేన అభ్యర్థి ఎస్. మురధు విస్తృత ప్రచారం అనుమతులు జీ ప్లస్‌ 2.. నిర్మాణాలు జీ ప్లస్‌ 3,లేదా జీ ప్లస్ 4.

ప్రజా ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి.. రాళ్లగంగమ్మ ఆలయంలో పూజలతో ప్రచారానికి శ్రీకారం

Select Suryaa Now
ప్రజా ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి.. రాళ్లగంగమ్మ ఆలయంలో పూజలతో ప్రచారానికి శ్రీకారం

కుప్పిగానిపల్లి, ఆగరం ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా మీనాక్షి హేమంబార్ గౌడ్ ప్రచారం ప్రారంభం

గుడిపల్లి మేజర్ న్యూస్:- మండలంలోని కుప్పిగానిపల్లి, ఆగరం ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీనాక్షి హేమంబార్ గౌడ్ గురువారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచార ప్రారంభానికి ముందు రాళ్లగంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. కుప్పిగానిపల్లి, ఆగరం గ్రామాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను నా సమస్యలుగా భావించి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తనపై నమ్మకంతో ఇచ్చే బాధ్యతను గౌరవంగా స్వీకరిస్తానని, గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

పదవిని అధికారంగా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తానని, ప్రతి ఒక్కరి అభిప్రాయాలకు విలువనిస్తూ గ్రామాల అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తానని అన్నారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుప్పం సమన్వయ కమిటీ కన్వీనర్ భవాని చంద్రశేఖర్, గుడిపల్లి మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 సూర్య రిపోర్టర్: లెనిన్ బాబు, గుడిపల్లి మండలం