30వ వార్డులో టీడీపీ అభ్యర్థి ఎస్. మహబూబ్ బాషా విస్తృత ప్రచారం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపాలిటీలోని 30వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎస్. మహబూబ్ బాషా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అభ్యర్థి రాజలక్ష్మి కృష్ణమూర్తికి ఒక ఓటు, 30వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తనకు మరో ఓటు వేసి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. చైర్‌పర్సన్ అభ్యర్థి రాజలక్ష్మి కృష్ణమూర్తితో పాటు తనను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహించారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్