జడ్పీటీసీ సమరంలో ఇద్దరు మహిళలు! * బరిలో తెదేపా, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు * వైకాపా అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ * నవంబరు 5న పోలింగ్.. ఉత్కంఠలో మండల ప్రజలు
వెల్దుర్తి సూర్య ప్రతినిధి రూలర్ మేజర్ న్యూస్.వెల్దుర్తి మండల ప్రజా పరిషత్ (జడ్పీటీసీ) స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం 'మహిళా అన్‌రిజర్వుడ్' కావడంతో వైకాపా అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ప్రధాన పోటీ తెలుగుదేశం, బహుజన్ సమాజ్ పార్టీల (బీఎస్‌పీ) మధ్యే పోటీ నెలకొంది. దీంతో బరిలో ఇద్దరు మహిళా అభ్యర్థులే మిగలడం స్థానికంగా విశేషంగా మారింది.తెలుగుదేశం పార్టీ తరఫున మోదేపల్లి శైలజ సుబ్బరాయుడుతో బీఎస్‌పీ అభ్యర్థిగా నాయకంటి సునీతమ్మ పోటీ పడుతున్నారు. తెదేపా అభ్యర్థి శైలజకు గతంలో (2014-2019) ఎంపీపీగా పోటీ చేసిన అనుభవం ఉంది. మరోవైపు బీఎస్‌పీ అభ్యర్థి సునీతమ్మ తొలిసారిగా జడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్నారు.వచ్చే నెల నవంబరు 5న జరిగే జడ్పిటిసి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అనుభవజ్ఞురాలైన తెదేపా అభ్యర్థి వైపు మొగ్గు చూపుతారా లేదా తొలిసారి బరిలోకి దిగిన బిఎస్పి అభ్యర్థికి అవకాశమిస్తారా అనేది మండల పరిధిలోని ఓటర్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందనేది వేచి చూడాల్సిందే!
సూర్య ప్రతినిధి కే రాజశేఖర్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం