దేవినేని అవినాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి.
కళ్యాణదుర్గం :-
యవ నాయకులు, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని అవినాష్ కి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి, ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు బుట్నా లక్ష్మీ తిమ్మరాజులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ గారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. యువ నాయకుడిగా రాజకీయ రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటూ, ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నిలవాలని, రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత కీలక పాత్ర పోషించాలని అభిలషించారు. దేవినేని అవినాష్ రాజకీయ ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని, ప్రజలకు మరింత సేవలందించే శక్తి, అవకాశాలు లభించాలని బుట్నా లక్ష్మీ తిమ్మరాజులు ఆకాంక్షించారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.