ఓటు హక్కు పరిరక్షణ కోసం చలో ఢిల్లీ
సూర్య కరీంనగర్: ఓటు చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతుగా నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఓటు హక్కు పరిరక్షణకు సంఘీభావం తెలపాలి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఆ హక్కు పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ గొంతును వినిపించాలని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ కార్యక్రమానికి సంఘీభావంగా కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో ఢిల్లీకి తరలివచ్చి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనంతుల రమేష్ విజ్ఞప్తి చేశారు