BREAKING
తెలంగాణ రక్షణ సేన (TRS) దళిత వింగ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చంటి శ్రీనివాస్ నియామకం పుట్టపర్తిలో కూటమి అభ్యర్థిని గెలిపించండి తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం ఎన్నికల కోఆర్డినేటర్‌గా జెల్లోజి శ్రీనివాస్ పటేల్ నియామకం అవతారపురుషుడా.. రాజకీయ ప్రతీకా? పరశురాముడి పురాణం వెనుక మరో కోణం ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణే లక్ష్యం.... జిల్లా ఎస్పీ ఎస్ .సతీష్ కుమార్ అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు కావాలి:మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ బ్యాంక్ ఖాతాదారులందరూ తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి .. నగరవాసుల ప్రాణాలు హరిస్తున్న జవహర్ నగర్ డంప్ యార్డ్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు నేటి రాశి ఫలాలు: అక్టోబర్ 30, 2026 (శుక్రవారం) – ఏ రాశి వారికి ధనలాభం? ఎవరికి పని ఒత్తిడి? అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి.. డీఎస్పీ రవిబాబు.. ఘనంగా దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు. 8వ వార్డులో జనసేన అభ్యర్థి ఎస్. మురధు విస్తృత ప్రచారం అనుమతులు జీ ప్లస్‌ 2.. నిర్మాణాలు జీ ప్లస్‌ 3,లేదా జీ ప్లస్ 4.

చలో ఢిల్లీకి రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ దండు..జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్

Select Suryaa Now
చలో ఢిల్లీకి రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ దండు..జెండా ఊపి ప్రారంభించిన సంగీతం శ్రీనివాస్

సూర్య బోయినపల్లి..ఓటు చోరీకి వ్యతిరేకంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన పోరాటానికి మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు గురువారం ఢిల్లీకి బయల్దేరాయి.చలో ఢిల్లీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు ప్రత్యేక బస్సు ద్వారా వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని సంగీతం శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థను కాలరాస్తూ కేంద్రం అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి అండగా ఢిల్లీ వెళ్తున్నామన్నారు.
యాత్రలో బోయినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మనబోయిన సువీన్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, మాజీ ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎల్లేష్ యాదవ్, వినోద్ రెడ్డి, జనరల్ సెక్రటరీ భరత్ రెడ్డి, బోయిని వేణు, రజనీకాంత్ తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.