పొన్నాల రైతు వేదికలో పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం వర్చువల్గా పాల్గొననున్న ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట: ఈరోజు ఉదయం 10 గంటలకు పొన్నాల రైతు వేదికలో నిర్వహించనున్న ప్రధానమంత్రి పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు వర్చువల్గాపాల్గొననున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా ఎంపీ రఘునందన్ రావు వర్చువల్ విధానంలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.