సూర్య స్టాఫ్ రిపోర్టర్ షేక్ మహమ్మద్ రఫీకి జాతీయ పురస్కారం
ఎం.వి. రావు ఫౌండేషన్ జర్నలిస్టు జాతీయ పురస్కారం – 2026 ప్రదానం
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు సూర్య స్టాఫ్ రిపోర్టర్ షేక్ మహమ్మద్ రఫీకి ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక జర్నలిస్టు జాతీయ పురస్కారం – 2026 ప్రదానం చేశారు. నెల్లూరులోని విజయకుమార్ ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా మెమెంటోను, ప్రముఖ సినీ రచయిత ఎస్.వి. స్వామినాయుడు చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని, ఫౌండేషన్ ఛైర్మన్ ఎం. లీలా మోహన్ కృష్ణ చేతుల మీదుగా మెడల్‌ను షేక్ మహమ్మద్ రఫీ స్వీకరించారు. జర్నలిజం రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో ఈ పురస్కారానికి ఎంపిక చేయడం ప్రొద్దుటూరుకు గర్వకారణంగా నిలిచింది. ఈ అవార్డు ఆయన వృత్తిపట్ల చూపుతున్న నిబద్ధతకు, జర్నలిజం రంగంలో కొనసాగిస్తున్న ప్రయాణానికి గుర్తింపుగా భావించవచ్చు. స్థానిక ప్రాంతానికి చెందిన జర్నలిస్టుకు జాతీయ స్థాయిలో పురస్కారం లభించడంతో పలువురు జర్నలిస్టులు, పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ షేక్ మహమ్మద్ రఫీకి అభినందనలు తెలియజేశారు.
- షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా