హాలీ బెర్రీకి కస్టడీ కేసులో బిగ్ రిలీఫ్!
హాలీవుడ్ ప్రముఖ నటి హాలీ బెర్రీ (Halle Berry), ఆమె మాజీ భర్త ఆలివర్ మార్టినెజ్ (Olivier Martinez) మధ్య కొనసాగుతున్న కుమారుడి కస్టడీ వివాదంలో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. హాలీ బెర్రీకి వ్యతిరేకంగా ఆలివర్ మార్టినెజ్ దాఖలు చేసిన 'డొమెస్టిక్ వయలెన్స్ రెస్ట్రైనింగ్ ఆర్డర్' (DVRO) పిటిషన్‌ను లాస్ ఏంజిల్స్ కోర్టు న్యాయమూర్తి తోసిపుచ్చారు.
తన 13 ఏళ్ల కుమారుడు మాసియో (Maceo)పై హాలీ బెర్రీ భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆలివర్ అక్టోబర్ ప్రారంభంలో తాత్కాలిక రెస్ట్రైనింగ్ ఆర్డర్ పొందగా, తాజా విచారణ అనంతరం కోర్టు ఆ ఆర్డర్‌ను రద్దు చేసింది (Dissolved). ఆలివర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన హాలీ బెర్రీ, తన కుమారుడిని ఎప్పుడూ ఏ విధంగానూ హింసించలేదని, తానే స్వయంగా గృహ హింస బాధితురాలినని కోర్టుకు సమర్పించిన డిక్లరేషన్‌లో స్పష్టం చేశారు.
రెస్ట్రైనింగ్ ఆర్డర్ పిటిషన్ కొట్టివేతతో హాలీ బెర్రీకి ఊరట లభించినప్పటికీ, కుమారుడి కస్టడీకి సంబంధించిన ప్రధాన వివాదం ఇంకా ముగియలేదు. ప్రస్తుతం ఆలివర్ మార్టినెజ్ ప్రాథమిక భౌతిక కస్టడీని కలిగి ఉండగా, హాలీ బెర్రీకి జాయింట్ లీగల్ కస్టడీతో పాటు తాత్కాలిక విజిటేషన్ హక్కులను కోర్టు కొనసాగించింది. ఈ వివాదంపై తదుపరి విచారణ నవంబర్ నెలలో జరగనుంది.