ఫ్యాషన్ సలహా ఇచ్చిన కరణ్ జోహార్
బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తన సినిమాల్లోని నటీనటుల ఫ్యాషన్, స్టైలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను తెరకెక్కించిన సినిమాల్లో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యే దిల్ హై ముష్కిల్' (అయాన్ సంగర్ పాత్ర), షారుఖ్ ఖాన్ నటించిన 'కభీ అల్విదా నా కెహనా' (దేవ్ సరన్ పాత్ర) లోని లుక్స్ తనకెంతో ఇష్టమని వెల్లడించారు. ఈ రెండు పాత్రల అవుట్‌ఫిట్స్, స్టైలింగ్ విధానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
వ్యక్తిగత ఫ్యాషన్ గురించి మాట్లాడుతూ, ఇతరుల ప్రశంసల కోసం కాకుండా ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్లు దుస్తులు ధరించాలని కరణ్ జోహార్ సూచించారు. "ఇది వినడానికి పాతమాటలా అనిపించినా, దయచేసి లోకం కోసం కాకుండా మీ కోసం మీరు దుస్తులు వేసుకోండి, ఫ్యాషన్ విషయంలో ఇతరుల గుర్తింపును కోరుకోవడాన్ని నేను అస్సలు సమర్థించను" అని స్పష్టం చేశారు. అలాగే, చాలామంది రెడ్ కార్పెట్‌పై రెడ్ కార్పెట్‌లాగే కనిపిస్తారంటూ తనదైన శైలిలో సరదా వ్యాఖ్యలు చేశారు.
ఇదే క్రమంలో తన వద్ద ఉన్న వ్యక్తిగత ఆభరణాలు, యాక్సెసరీస్ గురించి కూడా కరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల తన తల్లి హిరూ జోహార్‌కు చెందిన సొలైటైర్ నెక్లెస్‌ను సరదాగా దొంగిలించి తన వార్డ్‌రోబ్‌లో పెట్టుకుని ధరిస్తున్నానని, ఈ విషయం ఇప్పటికీ తన తల్లికి తెలియదని నవ్వుతూ వెల్లడించారు.