BREAKING
అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా మోటూరు నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా పెంటకోట స్వాతి ఏకగ్రీవ ఎన్నిక పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష అన్నమయ్య జిల్లా జడ్పీ చైర్మన్,వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం : చైర్మన్‌గా సుగవాసి ప్రసాద్ బాబు,వైస్ చైర్మన్‌గా తలారి శరణ్య : ప్రిసైడింగ్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడి పోలవరం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిరీష ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం ఎమ్మెల్యే దగ్గుపాటి తనకు తాను సర్టిఫికెట్ లు ఇచ్చుకోవడం హాస్యాస్పదం మాజీ మేయర్ మహమ్మద్ వసీం శివాలయంలో ప్రత్యేక పూజలు నెల్లూరు జడ్పీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుభాకాంక్షలు భక్తిశ్రద్ధలతో 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కుందుర్పి జడ్పీటిసి గా ప్రమాణ స్వీకారం ఇందిరమ్మ జీవిత బీమాను సద్వినియోగం చేసుకోవాలి -- చైర్ పర్సన్ సుహాసిని కుమారుడికి కిడ్ని దానం చేసిన తల్లి.. పలు శుభకార్యాల్లో పాల్గొన్న వి. ప్రణవ్ బాబు పోలేరమ్మ గుడి పక్కన ఆటోలు అడ్డా... భక్తులకి తీవ్ర ఇక్కట్లు బిజెపి నాయకులుకమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారలు అర్థరహితం..

బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్  పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థిని 

Select Suryaa Now
బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్  పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థిని 
సూర్య కరీంనగర్ : తెలంగాణ పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్న యస్.జి.ఎఫ్.ఐ. 70వ తెలంగాణ బాస్కెట్ బాల్ అండర్-14 పోటీలకు పద్మనగర్‌లోని పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని యన్.అశ్విక ఎంపికైనట్లు పాఠశాల డైరెక్టర్ కె. హన్మంతరావు, తెలిపారు  ఇటీవల కరీంనగర్ లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్  పోటీలలో      9వ తరగతికి చెందిన యన్.అశ్విక బాలికల అండర్-14 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యింది. ఈ నెల 21 నుండి 23 వరకు ఖమ్మం జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొనబోతోంది.   రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని ని  పాఠశాల చైర్మన్ డా. ఇ. ప్రసాద రావుతో పాటు డైరెక్టర్లు ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, రాకేశ్, వి.యు.యం. ప్రసాద్, వినోద్ రావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కె. హన్మంతరావు, సమన్వయకర్తలు రబీంద్రపాత్రో,  వ్యాయామ ఉపాధ్యాయులు యస్. రాజు, సాజన్  పాల్గొన్నారు.