విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంట పొలాలు..
విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంట పొలాలు..
అన్నదాత ఆందోళన..రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారులు స్పందించాలి
చేర్యాల : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో విద్యుత్ కోతలతో వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన రైతు కంతుల నర్సయ్య తన ఆవేదనను వ్యక్తం చేశారు. సాగుకు కీలక సమయంలో కరెంటు సరిగా రాకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. ప్రస్తుతం ఇస్తున్న విద్యుత్ సరిపోక పంటలు దెబ్బతింటున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి కనీసం 15 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు, ప్రభుత్వం రైతుల సమస్యను అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.