BREAKING
టీబీ నిర్మూలనలో కాల్వపల్లి భేష్ ఏపీ పోర్టుల అభివృద్ధిపై మహారాష్ట్ర మంత్రి నితేష్ అధ్యయనం: మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డితో భేటీ సురేష్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి..... ఉపాధి పనుల్లో జాప్యం వద్దు. పీడీ సలీం. ‘బిల్డ్ ఏపీ’ మా ప్రభుత్వ నినాదం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి - జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వి.రాములు పవన్ కళ్యాణ్ ఆశయాలే స్ఫూర్తిగా జనసేనలో యువత చేరికలు ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభతరం • వాట్సాప్‌ ద్వారా నేరుగా ఫిర్యాదులు చేసుకునే అవకాశం • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి • 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం • జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య కొత్తపట్నంలో రూ. 44.25 కోట్లతో 132/33 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభం: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు: 52 వారాల కనిష్టానికి పడిపోయిన నిఫ్టీ! గన్నవరం మాజీ సీఐ అహ్మద్ అలీ పెద్దకర్మ. నివాళులర్పించిన ప్రముఖులు, విలేకరులు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు: పోలవరం పనుల్లో గణనీయమైన పురోగతి! ప్రమాదపుటంచున  కరెంటు స్తంభం.... పట్టించుకునే నాధుడు లేడు....ప్రమాదం జరిగితే భారీ నష్టం

శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్ధుల సేవాభావం

Select Suryaa Now
శ్రీ గాయత్రి స్కూల్  విద్యార్ధుల సేవాభావం

గూడూరు, మేజర్‌న్యూస్‌  :    గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమానికి శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు నిత్యావసర సరుకులు అందచేశారు. గురువారం ఉదయం పాఠశాల విద్యార్ధులు వృద్ధాశ్రమానికి 15 రోజులకు సరిపడ బియ్యం, వెజిటబుల్స్ అందించి తమ సేవాభావం చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రగతి  అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులకు సేవాభావం అలవడాలనే ఉద్దేశంతో  శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ లీడర్షిప్ అనే కాన్సెప్ట్ లో భాగంగా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక స్పృహ పెంపొందించాలనే దృక్పథంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి , ఉపాధ్యాయులు నాసిర, మస్తాన్బీ, సుప్రజ, రేవంతి, రజిని, పర్వీన్, హరికృష్ణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.