BREAKING
శిలాఫలకాలే అభివృద్ధా? ఎమ్మెల్యేపై బొల్లా ఫైర్‌! తుమ్మలపెంటలో ఘనంగా వైఎస్‌ఆర్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ... సఖి వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం హెల్మెట్ ధరించిన ప్రయాణం,సుఖ ప్రయాణం: ఎస్ ఐ అమీర్ మా గ్రామంలో బాల్యవివాహాలు జరగవు - తీర్మానం చేసిన గ్రామసభలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు విద్యుత్ కోతలతో రైతాంగ పంటలకు నష్టం జరుగుతోంది నెల్లూరు రూరల్ అభివృద్దే మా లక్ష్యం మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా వర్ధంతి పరిశ్రమల పేరుతో రైతుల కడుపు కొట్టవద్దు: కావలి రైతు సంఘం. శ్రీ నికేతన్ హై స్కూల్ లో బతుకమ్మ సంబరాలు గోదాదేవి అమ్మవారికి వెండి కవచం బహుకరణ పునీత్ గ్రానైట్ ఫ్యాక్టరీలో విషాదం.. నీటి గుంటలో పడి కార్మికుడు మృతి కావలి గురుకుల పాఠశాలలో 'స్వచ్ఛత హి సేవా' – విద్యార్థులకు చెత్త సేకరణపై అవగాహన.

ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభతరం • వాట్సాప్‌ ద్వారా నేరుగా ఫిర్యాదులు చేసుకునే అవకాశం • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Select Suryaa Now
ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభతరం • వాట్సాప్‌ ద్వారా నేరుగా ఫిర్యాదులు చేసుకునే అవకాశం  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :  ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులను నేరుగా వాట్సాప్‌ ద్వారా అధికారుల దృష్టికి తీసుక వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఇకపై ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా, ఇంటి నుంచే వాట్సాప్‌ ద్వారా తమ సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లోని జిల్లా ఇన్చార్జి మంత్రి పేషీలోనూ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించడంతో పాటు, వాటి పరిష్కారంలో జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
ఇంచార్జ్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు పేషీ నం.8500689596, మంచిర్యాల కలెక్టరేట్‌ నం.9492123642
ప్రజలు పైన పేర్కొన్న నంబర్ కు కాల్ చేయవద్దని, కేవలం వాట్సాప్‌ నంబర్ కు తమ ఫిర్యాదులను మెసేజ్‌ రూపంలో పంపవచ్చని, ఫిర్యాదులో సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, సమస్య ఉన్న ప్రదేశం, చిరునామా, అవసరమైన ఆధారాలు, సంబంధిత ఫొటోలను జత చేయాలని, తద్వారా సమస్యను గుర్తించి, సంబంధిత శాఖకు ఫిర్యాదును పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, సులభంగా అందించడంతో పాటు, వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడమే ఈ ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.