గోదాదేవి అమ్మవారికి వెండి కవచం బహుకరణ
వింజమూరు మేజర్ న్యూస్ : వింజమూరు లోని శ్రీదేవి- భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాలలో నిత్య పూజల నిమిత్తం వింజమూరు లోని నడుమూరు కు చెందిన యల్లాల కుటుంబీకులు ప్రొఫెసర్ యల్లాల వెంకటరామిరెడ్డి- మంజుల దంపతులు 25 వేల రూపాయల విలువ కలిగిన వెండి కవచమును మరియు పట్టు వస్త్రాలను బహుకరించటం జరిగినది. ఈ సందర్భంగా చెన్నకేశవ స్వామి ఆలయంలో దేశములో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి మంచిగా వర్షాలు కురవాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పూజలు చేయటం జరిగినది. పూజారి కోగంటి రామానుజాచార్యులు మాట్లాడుతూ శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాని కి గతంలో కూడా యల్లాల కుటుంబీకులు శ్రీనివాసులు రెడ్డి- పద్మావతి, రఘురామిరెడ్డి - రజిని వెంకటరామిరెడ్డి- మంజుల దంపతులు దాదాపు 5 లక్షల రూపాయల విలువ కలిగిన స్వామివారికి వెండి కిరీటము, అమ్మవార్ల కు స్వామివారికి నాలుగు వెండి కాసుల హారాలు, నిత్య పూజల కోసం వెండి కలశాన్ని బహుకరణ చేశారని ఆయన తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్తలు గణపం రమణారెడ్డి మరియు గణపం సుదర్శన రెడ్డి దాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఎల్లాల సోదరులు మాట్లాడుతూ భగవంతునిపై ఉన్న చిరుపాటి భక్తితో ఈ చిరుకానుక అందించడం జరిగిందని తెలిపారు శ్రీ చెన్నకేశవ స్వామి వారి కృపాకటాక్షములతో వర్షాభావంతో ఉన్న పరిస్థితులను తొలగించి పూర్తిస్థాయిలో వర్షాలు కురిపించి ప్రజలను కరుణించాలని కోరుకున్నారు.